: ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్ లో సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. మెల్బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా, ఒరియా టేకు జోడి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్స్ లో సానియా జోడి ఆస్ట్రేలియాకు చెందిన గజ్డెసోవా, ఎబ్డెన్ జంటను 2-6, 6-3, 10-8తో మట్టి కరిపించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. మొదటి సెట్ ను 2-6తో కోల్పోయినప్పటికీ... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడిన సానియా, టేకు రెండో సెట్ ను 6-3తో గెలుచుకున్నారు. మూడో సెట్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. అయితే ఏ మాత్రం పట్టు సడలించకుండా ఆడి 10-8తో చివరి సెట్ ను కైవసం చేసుకున్న సానియా జోడి ఫైనల్స్ చేరుకుంది.