: మహిళా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత జట్టు
ఐసీసీ మహిళా ప్రపంచకప్ లో భారత్ పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన వన్డేలో శ్రీలంక జట్లు చేతిలో 138 పరుగుల భారీ తేడాతో ఓడిన టీం ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేయగా... లక్ష్య చేధనలో తడబడ్డ భారత జట్టు 144 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తక్కువ రన్ రేట్ తో భారత జట్టు గ్రూప్ 'ఎ' లో నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ గ్రూప్ నుంచి శ్రీలంక, ఇంగ్లండ్, విండీస్ సూపర్ సిక్స్ కు చేరుకున్నాయి.