: భువనగిరి నుంచి పోటీ చేస్తా: ఎర్రబెల్లి
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నేతలందరూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తన మనసులోని మాటను బయటపెట్టారు. పార్లమెంటు ఎన్నికలు షెడ్యూలు కన్నా ముందే జరిగితే... తాను భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాజ్యసభ రేసులో తాను లేనని చెప్పారు. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే... ప్రజల మనిషినైన తాను ఐదేళ్లపాటు ప్రజలతో మమేకమై పని చేస్తానని తెలిపారు.