: సోమ్ నాథ్ భారతిని వెనకేసుకొచ్చిన ఆమ్ ఆద్మీ
వివాదాస్పద ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్ నాథ్ భారతిని ఆమ్ ఆద్మీ పార్టీ వెనకేసుకొచ్చింది. గత వారం అర్ధరాత్రి సమయంలో మాదకద్రవ్యాల వ్యాపారం, వ్యభిచారం చేస్తున్నారంటూ... ఢిల్లీలోని ఆఫ్రికన్ మహిళలపై దాడి చేసిన సోమ్ నాథ్ భారతి అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో, సోమ్ నాథ్ తాను చేసిన పనికి తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఏఏపీ స్పష్టం చేసింది. "అతను సమాజంలో నెలకొన్న చెడు కార్యకలాపాలపై పోరాడినందుకు, అతన్ని అభినందించండి" అంటూ సూచించింది. అయితే, జరిగిన ఘటనపై సోమ్ నాథ్ ఈ రోజు 'ఢిల్లీ మహిళా కమిషన్' ముందు హాజరవుతున్నారు.