: యూపీఏ మళ్లీ అధికారంలోకి వస్తుంది: వీరప్ప మొయిలీ
కేంద్రంలో యూపీఏ ఆధ్వర్యంలో నడుస్తోన్న ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే భారతీయ జనతాపార్టీ హవా కొనసాగుతోందని ఆయన అన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమేనని ఆయన చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని మొయిలీ వెల్లడించారు.