: మాకు పార్టీ ముఖ్యం.. మాకు రాష్ట్రం ముఖ్యం: ఆనం, శోభానాగిరెడ్డి వాగ్వాదం


బీఏసీ సమావేశంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బీఏసీ సమావేశానికి సీఎం ఎందుకు రాలేదని వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. దీనిపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి స్పందిస్తూ, మంత్రులుగా తాము హాజరయ్యామని, అది చాలని అన్నారు. ప్రాంతాల వారీగా మంత్రులు విడిపోయినప్పుడు బీఏసీలో కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టంగా ఉండే అవకాశం లేదని ఆమె నిలదీశారు. దీనికి మంత్రి ఆనం సమాధానమిస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, అందుకే అందరి ప్రయోజనాలను కాపాడాల్సి ఉందన్నారు. దీంతో శోభానాగిరెడ్డి తమకు పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని చెప్పారు. అందుకే తాము ప్రజల పక్షాన, రాష్ట్రం పక్షాన నిలబడ్డామని సమాధానమిచ్చారు. దీనిపై తమకు పార్టీ కూడా ముఖ్యమని మంత్రి ఆనం బదులిచ్చారు.

  • Loading...

More Telugu News