: రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో రథసప్తమి వేడుకల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేదీన, రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. రథ సప్తమిని పురస్కరించుకుని.. ఏడు ప్రధాన వాహనాలలో తిరుమలేశుడు ఊరేగుతారని టీటీడీ అధికారులు తెలిపారు.