: మీది స్వార్థం.. మాది త్యాగం: వైఎస్ విజయమ్మ
ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు ప్రాంతాల వారీగా వాదనలు వినిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ, పార్టీలన్నీ స్వార్థంతో వాదనలు వినిపిస్తుంటే తాము మాత్రం త్యాగంతో ఒకే వాదన వినిపిస్తున్నామని అన్నారు. రాజకీయ నష్టాలు లెక్క చేయకుండా ఒకే వాదంతో మాటమీద నిలబడ్డామని ఆమె తెలిపారు. అధికార, ప్రతిపక్షాలు ఒకటై ప్రజల మధ్య విభేదాలు రాజేస్తున్నారని ఆమె విమర్శించారు. బిల్లుపై ఓటింగ్ ఉండాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.