: ప్రాజెక్టుల గురించి సీఎం మాకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు: హరీష్ రావు


నీటి ప్రాజెక్టుల గురించి సీఎం తమకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు మరిన్ని నీళ్లు వస్తాయని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తమకు తెలుసని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ, హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో సీఎం అవాస్తవాలు చెబుతున్నారని... ఆయన సానుభూతి తమకు అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రికి తమపై మాటల్లో ప్రేమే తప్ప, చేతల్లో ప్రేమ లేదని విమర్శించారు. సభలో తాను అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానాలు కూడా చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News