: బిల్లుపై ఓటింగ్ కు బీఏసీలో రాని స్పష్టత


టీబిల్లుపై చర్చకు వారం రోజుల పాటు గడువు పెంచినట్టు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి ఉత్తర్వులు అందిన నేపథ్యంలో... బీఏసీ సమావేశం జరిగింది. ఈ నెల 26వ తేదీ (గణతంత్ర దినోత్సవం) మినహా ఆరు రోజుల పాటు సభను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వీలైనంత త్వరగా టీబిల్లును పార్లమెంటుకు పంపాలని టీ.ఎమ్మెల్యేలు కోరారు. అదే విధంగా, సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. చర్చ పూర్తయ్యే వరకు తీర్మానాలు తీసుకోరాదని టీఆర్ఎస్, ఎంఐఎంలు కోరాయి. అయితే బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించాలన్న అంశంపై స్పష్టత రాలేదు.

  • Loading...

More Telugu News