: హైదరాబాద్ లో బ్రిటన్ లగ్జరీ మోటార్ సైకిళ్ల కంపెనీ షోరూం.. ధర 12 లక్షల పైమాటే
బ్రిటన్ కు చెందిన లగ్జరీ, ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో షోరూం ప్రారంభించింది. బంజారాహిల్స్ లో షోరూంను ఆ సంస్థ ఎండీ విమల్ సంబ్లీ ప్రారంభించారు. ఈ షోరూంలో అత్యాధునిక మోటార్ సైకిళ్లను విక్రయిస్తామని, ప్రస్తుతానికి ఆరు రకాల మోటార్ సైకిళ్లను విక్రయిస్తామని ఆయన అన్నారు. వాటి ప్రారంభ ధర 12.30 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ షోరూంలో బైకులకు సంబంధించిన విడిభాగాలతో పాటు, సర్వీసు సేవలు కూడా లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.