: గడువు పెంచారు.. సద్వినియోగం చేసుకోండి: దిగ్విజయ్
టీబిల్లుపై చర్చించడానికి భారత రాష్ట్రపతి ప్రణబ్ వారం రోజులపాటు గడువు పొడిగించడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని చర్చను పూర్తి చేయాలని కోరారు. చర్చ పూర్తయిన వెంటనే బిల్లును ఢిల్లీకి పంపాలని తెలిపారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయన్న ఆశాభావాన్ని డిగ్గీ రాజా వ్యక్తం చేశారు. రాజ్యసభకు పోటీ చేయాలనుకోవడం జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తిగత అంశమని చెప్పారు.