: వారం రోజుల గడువును మరింత పెంచుతారని ఆశిస్తున్నా: లగడపాటి


తెలంగాణ బిల్లుపై చర్చకు రాష్ట్రపతి వారం రోజుల పాటు గడువిచ్చారని... ఈ గడువును మరిన్ని రోజులు పెంచుతారని ఆశిస్తున్నట్టు విజయవాడ ఎంపీ లగడపాటి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కొత్త పార్టీ వచ్చేది, రానిది త్వరలోనే తేలుతుందని చెప్పారు. మంత్రి బాలరాజు లాంటి వారు, మరికొందరు పదవుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ కూడా ఉంటుందని చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని లగడపాటి అన్నారు.

  • Loading...

More Telugu News