: ఆమ్ ఆద్మీ మంత్రి మెడకు బిగుస్తున్న ఉచ్చు
మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం, వ్యభిచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఆఫ్రికన్ మహిళలపై దాడి చేయించిన ఘటనలో ఢిల్లీ మంత్రి, ఏఏపీ నేత సోమనాథ్ భారతి మెడకు ఉచ్చు బిగుస్తోంది. గత బుధవారం అర్ధరాత్రి తమపై జరిగిన ఈ దాడిపై ఎఫ్ఐఆర్ కు ఆదేశించాలని ఓ ఉగాండా మహిళ ఢిల్లీలోని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, జరిగిన ఘటనపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. అంతేకాక, మంత్రి పదవి నుంచి సోమనాథ్ భారతిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.