: వంతెనకు షిండే శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ కు తుపాను నష్టం కింద 700 కోట్ల రూపాయల సాయాన్ని మంజూరు చేశామని కేంద్ర హోం మంత్రి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలోని, కల్వపూడి వద్ద హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
విపత్తు సమయాలలో ఆదుకుంటామని తెలిపారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న అనంతరం షిండే ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శంకుస్థాపన వేదిక ప్రాంతానికి కారులో చేరుకున్నారు.