: అక్కినేని చివరి చూపు కోసం వచ్చిన శ్రీదేవి
అలనాటి నటి శ్రీదేవి మహానటుడు అక్కినేనిని కడసారి చూసేందుకు కొద్ది సేపటి క్రితమే అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. చివరి నిమిషంలో వచ్చిన ఆమె అక్కినేనికి అంజలి ఘటించారు. ఆమెతో పాటు ఆమె సోదరి మహేశ్వరి కూడా వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో అంత్యక్రియలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాణిశ్రీ, జయసుధ, గీతాంజలి తదితర అలనాటి నటీమణులు ఆయనకు అశ్రునివాళి అర్పించిన వారిలో వున్నారు.