: తెలంగాణ బొగ్గును సీమాంధ్ర వాడుకోవడం లేదు: సీఎం


తెలంగాణలో ఉత్పత్తయ్యే బొగ్గును సీమాంధ్రులు వాడుకుంటున్నారన్నది అవాస్తవమని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి నుంచి సీమాంధ్ర ప్రాంతానికి ఒక్క టన్ను బొగ్గును కూడా కేటాయించలేదని తెలిపారు. సింగరేణి కాలరీస్ నుంచి ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నామని సీఎం వెల్లడించారు. తమ బొగ్గును సీమాంధ్రులు వాడుకుంటున్నారని పదేపదే ఆరోపించడం సరికాదని సీఎం సూచించారు.

బొగ్గు కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించదని, ఆ అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని కిరణ్ వివరించారు. ప్రకృతి వనరులపై పూర్తి అజమాయిషీ కేంద్రానికే ఉంటుందని, రాష్ట్రాలకు వాటా ఉంటుందే కానీ, అధికారం ఉండదని ఆయన తెలిపారు. దీనిపై టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News