: ముఖ్యమంత్రి 'పంపు సెట్ల' లెక్కలు!


1957లో తెలంగాణ ప్రాంతంలో 231 పంపుసెట్లు మాత్రమే ఉన్నాయని, సీమాంధ్ర ప్రాంతంలో 4,600 పంపుసెట్లు ఉన్నాయని సభకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, 2012లో సీమాంధ్ర ప్రాంతంలో 13 లక్షల పంపుసెట్లుంటే, తెలంగాణ ప్రాంతంలో 17 లక్షలు ఉన్నాయని అన్నారు. రైతులకు 57శాతం ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని అన్నారు. ఉచిత విద్యుత్ వల్ల 19,377 కోట్ల రూపాయలు మేరకు తెలంగాణ ప్రజలు లాభపడ్డారని ఆయన తెలిపారు.

వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, రికార్డులలో ఉన్న లెక్కలనే తాను చెబుతున్నానని కిరణ్ బల్లగుద్ది మరీ చెప్పారు. వాడుకుంటున్న విద్యుత్ లో ఎక్కువ శాతం తెలంగాణలోనే వినియోగం అవుతోందని ఆయన స్పష్టం చేశారు. విభజన జరిగితే ఎక్కువ శాతం తెలంగాణ ప్రాంతానికే నష్టం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, వాస్తవాలను ఒప్పుకోవాలంటే దానికి చాలా గుండె ధైర్యం కావాలని అన్నారు.

  • Loading...

More Telugu News