: మరింత నాణ్యతతో శ్రీవారి లడ్డూ: టీటీడీ


తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో మరింత నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎం.జి.గోపాల్ వెల్లడించారు. దానికోసం లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యతను మరింత పెంచుతామని చెప్పారు. ఈ మేరకు బాలాజీ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ టెండర్ విధానంలో దశల వారీగా పారదర్శకతను అమలు చేస్తామన్నారు. దానికోసం కూడా మార్పులు చేర్పులు చేపట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు గోపాల్ వివరించారు.

  • Loading...

More Telugu News