: రేపు బీఏసీ సమావేశం జరుగుతుందా?
శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) రేపు సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చకు ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రపతి గడువునిచ్చిన నేపథ్యంలో బీఏసీ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ శాసనసభ సమావేశాల్లో సభ్యులంతా చర్చించేందుకు సమయం సరిపోని కారణంగా... ఓటింగ్ చేపట్టాలని పార్టీలు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.