: అక్కినేని అంతిమయాత్ర ప్రారంభం
ఫిలింఛాంబర్ నుంచి అక్కినేని నాగేశ్వరరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిలింఛాంబర్ వద్ద చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని రంగాలవారు అక్కినేని భౌతిక కాయాన్ని కడసారి సందర్శించి నివాళులర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన శకటంలోకి ఆయన భౌతికకాయాన్ని చేర్చారు. అక్కినేని అభిమానులు, తెలుగు సినీ అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది.