: అక్కినేని మృతికి కర్ణాటక శాసనసభ సంతాపం
తెలుగు సినీ నటదిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల కర్ణాటక శాసనసభ సంతాపం ప్రకటించింది. భారత చలనచిత్ర రంగానికి అక్కినేని చేసిన సేవలు చిరస్మరణీయమని శాసనసభ్యులు కొనియాడారు. కాగా అక్కినేని కన్నడ సినిమాల్లో నేరుగా నటించకపోవడం విశేషం. తెలుగు సినిమాలకు కన్నడనాట ఆదరణ ఉండడంతో అక్కినేని సినిమాలు అక్కడ కూడా ఆదరణకు నోచుకునేవి.