: టీబిల్లుపై చర్చకు ఈనెల 30 వరకు గడువు పెంపు


అసెంబ్లీలో టీబిల్లుపై చర్చించడానికి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడువును పొడిగించారు. వారం రోజుల పాటు (ఈ నెల 30 వరకు) గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో, ఈ నెల 26 (రిపబ్లిక్ డే)ను మినహాయిస్తే మరో ఆరు రోజులపాటు సభ జరగబోతోంది. దీంతో, షెడ్యూలు ప్రకారం ఈ రోజుతో చర్చ ముగుస్తుందా? లేక మరిన్ని రోజులు కొనసాగుతుందా? అనే సందేహాలకు తెర పడింది.

గడువు పెంపుకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర హోం శాఖ మంత్రి షిండే కలుసుకున్నారు. అనంతరం సోనియా నివాసంలో సోనియాగాంధీ, షిండే, ఆజాద్, ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్ లు భేటీ అయ్యారు. ఆ తర్వాత, టీబిల్లుపై చర్చకు గడువు పెంచుతున్నట్టు ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.

  • Loading...

More Telugu News