: అక్కినేని అంతిమయాత్రలో చిరంజీవి
మహానటుడు అక్కినేని అంతిమయాత్రలో కేంద్ర మంత్రి చిరంజీవి పాలుపంచుకున్నారు. ఫిల్మ్ చాంబర్ నుంచి అక్కినేని భౌతికకాయాన్ని తీసుకొస్తున్న వాహనంలో చిరంజీవి కూడా బయలుదేరారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో, పోలీసు వాయిద్యాల నడుమ అక్కినేని పార్థివదేహాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ కు తరలిస్తున్నారు. అశేష అభిమానులు ఆయనకు చివరిసారిగా అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతున్నారు.