: ఆగంతుకుల నుంచి మగువలకు రక్షణనిచ్చే హెయిర్ క్లిప్
జడ కొప్పును నిలబెట్టడానికే కాదు.. ఆపదల సమయంలో ఆగంతుకుల నుంచి మగువలకు రక్షణ కల్పించే హెయిర్ క్లిప్ వచ్చేసింది. ఈ హెయిర్ క్లిప్ ను జడకు పెట్టుకుంటే చాలు.. ఎవరైనా దాడికి యత్నిస్తే.. ఆ సమాచారాన్నంతా ముందుగా పేర్కొన్న నిర్ధేశిత నంబర్లకు చేరవేస్తుంది. దాడికి సంబంధించిన ఆధారాలను కూడా భద్రపరుస్తుందట. ఇందుకోసం ఈ క్లిప్ లో సెన్సర్లు అమర్చారు. మొబైల్ అప్లికేషన్ సాయంతో ఇది పనిచేస్తుంది. అమెరికాకు చెందిన రాచెల్ దంపతులు దీని సృష్టికర్తలు.