: జియాఖాన్ హత్య కేసులో దర్యాప్తుకు ఎఫ్ బీఐ సహాయం


బాలీవుడ్ వర్ధమాన నటి జియా ఖాన్ హత్యకు నటుడు సూరజ్ పంచోలీయే కారణమని రెండు రోజుల కిందట కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీటులో సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కేసులో దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులకు సాంకేతిక మరియు ఫోరెన్సిక్ సహాయం చేస్తామని సీబీఐకు.. ఎఫ్ బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఓ లేఖ రాసింది. అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన ఎఫ్ బీఐకు కొన్ని రోజుల కిందట జియా తల్లి రబియా ఖాన్ విజ్ఞప్తి చేయడంతో స్పందించిన సంస్థ చీఫ్ రోజ్మేరీ మెక్క్రే ఈ మెయిల్ ద్వారా నిన్న(బుధవారం)తెలిపారు. అయితే, భారతీయ అధికారులు ఇందుకు అనుమతిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News