: ఆ తప్పు మరోసారి చేయను: అమర్ సింగ్
ఒకసారి సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)లో ఉండి తప్పుచేశానని... మరోసారి ఆ పార్టీలో చేరి మరో తప్పు చేయలేనని రాజ్య సభ సభ్యుడు అమర్ సింగ్ అన్నారు. అఖిలేష్ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కరవైందని, పాలన అస్తవ్యస్థంగా మారిందని దుయ్యబట్టారు. ఇలాంటి పార్టీతో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అమర్ సింగ్ అప్పట్లో ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితుడు. ఎస్పీకి కార్పొరేట్ లుక్ తెచ్చిన మేధావిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే ములాయంతో ఆయనకు బెడిసి కొట్టడంతో ఆయన ఎస్పీ నుంచి బయటకు వచ్చి... రాష్ట్రీయ లోక్ మంచ్ అనే సొంత పార్టీని స్థాపించారు.