: రాజ్యసభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ మద్దతు తీసుకోము: కరుణానిధి
తమ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికకు పోటీ చేస్తున్న త్రిచీ ఎన్ శివ విషయంలో కాంగ్రెస్ నుంచి మద్దతు తీసుకోవడం లేదని డీఎంకే అధినేత కరుణానిధి తెలిపారు. ప్రస్తుతం 26 మంది ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకేకు.. ఇంకా ఎనిమిది మంది మద్దతు అవసరం. అయితే, అటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మద్దతిచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఎలా తన అభ్యర్థిని గట్టెక్కిస్తారనేది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోబోమని కొన్ని రోజుల కిందట కరుణ ప్రకటించారు.