: గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం
సినీ గాయని శ్రావణ భార్గవికి కారు ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ఎలాంటి గాయాలవకుండా ఆమె బయటపడ్డారు. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న (బుధవారం) ఉదయం వెళుతున్న భార్గవి కారు ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న ఓ ట్రాక్టర్ ను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దాంతో, కారు టైరు పగిలి ఆగిపోయింది. వెంటనే ఆ విషయాన్ని భర్త, గాయకుడు హేమచంద్రకు సమాచారం అందించడంతో, అక్కడికి చేరుకుని భార్గవిని మరో కారులో విజయవాడకు తీసుకువెళ్లాడు.