: 'అవతార్' కథ కాపీ చేసింది కాదు: అమెరికా కోర్టు


అవతార్ చిత్రానికి సంబంధించి కథా చౌర్యం కేసులో విఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ కు విముక్తి లభించింది. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన కేసును అమెరికాలోని లాస్ ఏంజెలస్ కోర్టు కొట్టివేసింది. సైన్స్ ఫిక్షన్ కథా రచయిత అయిన బైరంట్ మూరే 2011 డిసెంబర్ లో జేమ్స్ కామెరాన్ కు వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. తన స్క్రీన్ ప్లే, రచనలను ఉపయోగించి కామెరాన్ అవతార్ ను రూపొందించారని మూరే ఆరోపించారు.

విచారణలో భాగంగా.. కామెరాన్(59) మూరే రచనలను కాపీ చేసి అవతార్ చిత్రాన్ని రూపొందించారనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది. అవతార్ కు సంబంధించి కామెరాన్ కు వ్యతిరేకంగా దాఖలై కొట్టివేతకు గురైన మూడో కేసు ఇది. దీనిపై కామెరాన్ స్పందిస్తూ.. 'అవతార్ పూర్తిగా నా వ్యక్తిగత చిత్రం. దశాబ్దాలుగా ఎన్నో అంశాలను పరిశీలించి రూపొందించిన సినిమా అది. ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మకత కలిగిన బృందం రూపొందించింది' అని చెప్పారు.

  • Loading...

More Telugu News