: బిల్లుపై సీఎంతో రేపు మాట్లాడతా: దిగ్విజయ్ సింగ్
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రేపు మాట్లాడనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కిరణ్ రేపు తనను కలిసేందుకు ఢిల్లీ వస్తున్నట్లు వెల్లడించారు. కాగా, బిల్లుపై చర్చకు గడువు పెంపు విషయం, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.