: సల్మాన్ మదిలో జయహో భయం
జయహో.. సల్మాన్ ఖాన్ ఎన్నో అంచనాలతో, ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా. కానీ, విడుదలకు ముందు ఈ సినిమా సల్మాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బాక్సాఫీసు వద్ద తన చిత్రం బంపర్ హిట్ అవుతుందా? బోల్తా పడుతుందా? దాని జాతకమేంటా? అన్న ఆందోళనలో పడిపోయాడు. జయహో తలరాత గురించి ఆందోళన చెందుతున్నట్లు సల్మానే స్వయంగా వెల్లడించడం విశేషం. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గతంలో ఎంతో ఇష్టపడి చేసిన సినిమా బోల్తా కొట్టిందని.. కానీ, జయహో అలా కాదని భావిస్తున్నానన్నారు. ఇందులో కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఉంటాయని చెప్పారు. సోహైల్ ఖాన్ దర్వకత్వం వహించిన ఈ సినిమాలో టబు, సనాఖాన్ తదితరులు నటించారు.