: శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేయనున్న కేంద్రం!
మొత్తానికి డీఎంకే ఒత్తిడికి కేంద్రం తలొగ్గినట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ లో శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికా ప్రవేశపెట్టనున్న తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని కరుణానిధి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. లేకుంటే యూపీఏ నుంచి వైదొలగుతామని హెచ్చరించారు.
అసలే బొటా బొటీ మెజారిటీతో ఉన్న యూపీఏ సర్కారు 18 ఎంపీలున్న డీఎంకే హెచ్చరికలతో మనసు మార్చుకున్నట్లు సమాచారం. దీంతో మానవ హక్కుల ఉల్లంఘన తీర్మానంలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేయడానికి యూపీఏ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పందిస్తూ ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేస్తామని స్పష్టంగా చెప్పారు.