: అహోబిలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
అహోబిలం నారసింహ క్షేత్రంలో నేటి నుంచీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్నూలు జిల్లాలో ఉన్న ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరుగుతుంది. ఈ నెల 28 వరకూ ఇవి కొనసాగుతాయి.