: చరిత్ర తెలుసుకోండి... ఉలిక్కిపడకండి: సీఎం


తాను ఇంకా చాలా మాట్లాడాల్సి ఉందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కు చరిత్ర లేదని, తమ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందని, దానిని తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముందుగా చరిత్రను మాట్లాడుతాను, జరిగిన అభివృద్ధి, వాస్తవాలు, వక్రీకరణలు అన్నీ మాట్లాడతానని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ముందు తాను చెప్పే చారిత్రక వాస్తవాలు తెలుసుకోవాలని, అంతకు ముందే ఉలిక్కిపడడం మంచిది కాదని సీఎం కొందరు సభ్యులను ఉద్దేశించి అన్నారు.

  • Loading...

More Telugu News