: వివాదం లేని దానిని వివాదం చేయకండి: ఆనం
ముఖ్యమంత్రి స్థానంలో మరొకరు ఎవరూ కూర్చోలేరని, ఆయన స్థానం ఏమిటో తెలిసిన వారంతా ఆయన ఏ స్థాయిలో చెబుతారో తెలుసుకోకుండా మాట్లాడడం సముచితం కాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగం సందర్భంగా నెలకొన్న గందరగోళంపై ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభానాయకుడి స్థాయిలో మాట్లాడుతారని అందులో ఎవరికైనా ఎందుకు సందేహం వస్తోందో తమకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. వివాదం కాని విషయాన్ని వివాదం చేయాలనుకోవడం సరైన సంప్రదాయం కాదని ఆనం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సమయం సరిపడేంత సమయం లేదని, ముఖ్యమంత్రికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఇవ్వాలని ఆనం సూచించారు.