: కేజ్రీవాల్ 'పిచ్చి ముఖ్యమంత్రి'!: షిండే


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పరోక్షంగా వ్యాఖ్యల దాడి చేశారు. ఈ రోజు మహారాష్ట్రలోని హింగోలీలో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన, తను పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో తన పెళ్లి అయిందని, ఆ తర్వాత రోజు తన సెలవును క్యాన్సిల్ చేశారని చెప్పారు. ఓ చోట అల్లర్లు జరుగుతున్న కారణంగా అలా చేశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఓ 'పిచ్చి ముఖ్యమంత్రి' ధర్నా కారణంగా పోలీసుల సెలవులను తాను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ఇక్కడ కేజ్రీవాల్ పేరు ప్రస్తావించకుండా షిండే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News