: రైలు ప్రయాణంలో 110 గ్రాముల బంగారం మాయం
రైలు ప్రయాణంలో 110 గ్రాముల బంగారు నగలు గల్లంతైన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ వాసి వెంకట శివ కుమార్ ఈ నెల 14వ తేదీన భార్య, కుమార్తెతో కలసి మాచర్ల - భీమవరం రైలులో బయల్దేరి భీమవరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ తరువాత బ్యాగు చూసుకోగా.. 110 గ్రాముల బంగారు నగలు గల్లంతైనట్టు గుర్తించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.