: మంత్రి బాలరాజు వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతల ఆగ్రహం


కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానంటూ శాసనసభలో మంత్రి బాలరాజు చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్ర ప్రాంత నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన అభిప్రాయాన్ని చెబుతూ, తాను పార్టీ అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉన్నానన్నారు. దీంతో 'సీమాంధ్ర ద్రోహి' అంటూ సీమాంధ్ర టీడీపీ నేతలు నినాదాలు చేశారు. వారికి కాంగ్రెస్ నేతలు కూడా వంతపాడారు. మంత్రి బాలరాజుకు టీఆర్ఎస్ నేత హరీష్ రావు తదితరులు మద్దతు పలికారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో స్పీకర్ సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News