: ముంబయిలోని పిల్లల ఆసుపత్రికి సచిన్ విరాళం


క్రికెట్ నుంచి రిటైర్ అయిన సచిన్ టెండుల్కర్ ముంబయిలోని బాయి జెర్బాయ్ వాడియా చిన్న పిల్లల ఆసుపత్రికి రూ.10 లక్షల విరాళమిచ్చాడు. 'పిల్లల్లో గుండెజబ్బులు'పై అవగాహన కల్పించేందుకు నిన్న(మంగళవారం) జరిగిన కార్యక్రమంలో సచిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన విరాళాన్ని ప్రకటించాడు. ఆసుపత్రుల కోసం అందరూ విరాళాలివ్వాలని పిలుపునిచ్చిన సచిన్.. అనంతరం కొద్దిసేపు అక్కడి పిల్లలతో గడిపాడు.

  • Loading...

More Telugu News