: లిఫ్టు ఇస్తామని చెప్పి ...ఒకరి తరువాత ఒకరు అనుభవించారు!


ఉత్తరప్రదేశ్ లో కీచకులు స్వైరవిహారం చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా అత్యాచార ఘటనలు ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూస్తున్నాయి. జాన్ పద్ హపూడ్ గ్రామానికి చెందిన మహిళ బుధనాం గేట్ లో జరిగే సంతకు వెళ్లింది. తెలిసిన యువకుడు గ్రామం వరకు లిఫ్టు ఇస్తామనే సరికి అతనితోపాటు వెళ్లింది. అతను, అతని మిత్రులు ఫతేలాపూర్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, ఒకరి తరువాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను హపూడ్ గ్రామానికి తీసుకెళ్లి కదులుతున్న కారులోంచి తోసేశారు. అనంతరం స్థానికుల సాయంతో తేరుకున్న ఆమె నిందితులపై, జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇద్దరిని రషీద్, మష్రుగా పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసి పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News