: ఆదాయపు పన్ను చెల్లింపులో మొదటి స్థానంలో అక్షయ్ కుమార్


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇప్పుడు అగ్రభాగాన నిలిచాడు. ఎందులో అనుకుంటున్నారా ... ముందస్తు ఆదాయపు పన్ను చెల్లించడంలో!  ఈ ఏడాదికి ఆయన ఏకంగా 18 కోట్లు ముందస్తు పన్ను చెల్లించాడు. ఈ విషయంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లను అక్షయ్ అధిగమించాడు.

సల్మాన్ 11 కోట్లు, షారుఖ్ 10 కోట్ల 50 లక్షలు, అమీర్ 8 కోట్లు చెల్లించి అక్షయ్ తర్వాత వరుస స్థానాల్లో నిలిచారు. ఇక కథానాయికల విషయానికి వస్తే, 4 కోట్ల 50 లక్షలు కట్టి కత్రినా కైఫ్ మొదటి స్థానంలో వుంది. ఆ తర్వాత 4 కోట్లతో కరీనా కపూర్, 2 కోట్లతో ప్రియాంకా చోప్రా తదుపరి స్థానాలలో వున్నారు.                

  • Loading...

More Telugu News