: అక్కినేనితో కలిసి నటించడం గొప్ప అదృష్టం: సమంత
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల కథానాయిక సమంత ట్విట్టర్ లో సంతాపం వ్యక్తం చేసింది. ఆయనను కోల్పోవడం తీరని లోటని పేర్కొంది. ఆయనతో కలిసి నటించడం చాలా అదృష్టమని తెలిపింది. అక్కినేని చివరి చిత్రం 'మనం. ఇందులో నాగ చైతన్య సరసన సమంత చేస్తున్న సంగతి తెలిసిందే.