: అక్కినేనికి శాసనసభ నివాళి
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతికి శాసనసభ ఘన నివాళి అర్పించింది. చలనచిత్ర నటుడిగానే కాకుండా, మంచి మనిషిగా అక్కినేని నిరూపించుకున్నారని స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభకు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయనలోని సేవాతత్పరుడు బయటపడేవారని, ఆపన్నులను ఆదుకునేందుకు అక్కినేని ఎప్పుడూ ముందుండేవారని స్పీకర్ తెలిపారు. పద్మవిభూషన్, పద్మభూషన్, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే వంటి ఎన్నో అవార్డులు ఆయన కీర్తికిరీటంలో నిలిచిపోయాయని కొనియాడారు. అక్కినేని మరణానికి సంతాపం ప్రకటిస్తూ సభ కొన్ని నిమిషాలు మౌనం పాటించింది.