: అక్కినేని మనసుకు మడతలు లేవు...ముఖానికి ముడతలు రావు: సినారె
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రముఖ గీతరచయిత సి.నారాయణరెడ్డి (సినారె) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956లో అక్కినేనితో పరిచయం అయిన నాటి నుంచి.. ఆయనతో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నానని ఆయన తెలిపారు. అక్కినేని మనసుకు మడతలు లేవు...ముఖానికి ముడతలు రావు అనే మాటలను ఉదాహరించుకోవాలని సినారె అన్నారు.