: పశ్చిమాసియా కంపెనీలను రష్యా హ్యాక్ చేస్తోంది: భద్రత సంస్థ
పశ్చిమాసియాకు చెందిన వందలాది సంస్థలను రష్యా ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని అమెరికాకు చెందిన భద్రత సంస్థ క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది. అర్ధిక, రాజకీయ లాభాల కోసం ఇలాంటి సైబర్ దాడులు జరుగుతున్నట్లు పేర్కొంది. అయితే, హ్యాక్ అయిన కంపెనీలను పేర్లను, మిగతా వివరాలను తెలిపేందుకు భద్రత సంస్థ తిరస్కరించింది. విచారణ సంబంధించిన రహస్య ఒప్పందాల కారణంగా ఇతర వివరాలు చెప్పలేమని తెలిపింది. సదరు దేశ వ్యాప్తంగా కొన్ని ముఖ్య ప్రాంతాల్లో పోటీ తత్వాన్ని తట్టుకుని నిలబడేందుకు ఇటువంటి దాడులు ప్రేరేపిస్తాయని క్రౌడ్ స్ట్రైక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డిమిత్రీ చెప్పారు. గతంలో విలువైన మేధో సంపత్తి కోల్పోయిన కొన్ని సాంకేతిక సంస్థలు సైబర్ గూఢచర్య ప్రచారంలో తెలపలేదని వివరించింది.