: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహులే ప్రధాని: చిదంబరం
మరో రెండు నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని సీనియర్ నేతలు కోరినా అధిష్ఠానం మాత్రం విముఖతగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే తప్పకుండా రాహులే ప్రధానమంత్రి అవుతారని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. దావోస్ లో జరుగుతున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్'లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్జీ వచ్చే అవకాశం లేదన్నారు.