: ఉమ్మడి రాజధాని వస్తే ఆంధ్రప్రదేశ్ ది కూడా కేజ్రీవాల్ పరిస్థితే : అశోక్ బాబు
ఉమ్మడి రాజధాని ఏర్పాటైతే ప్రస్తుతం కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న పరిస్థితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పడుతుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ, విభజన బిల్లులో పేర్కొన్న ఉమ్మడి రాజధాని రాజులేని రాజ్యంలాంటిదని అన్నారు. సమైక్య ఉద్యమం మలిదశలో ఉన్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.