: మా అమ్మకు అక్కినేని సినిమాలంటే పిచ్చి: చిరంజీవి
అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపం తెలిపిన కేంద్రమంత్రి చిరంజీవి.. తన తల్లి అంజనాదేవికి అక్కినేని సినిమాలంటే ఎంత ఇష్టమో వివరించారు. 'నాగేశ్వరరావుగారి సినిమాలంటే మా అమ్మకు బాగా పిచ్చి. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ అక్కినేనిగారి సినిమా చూడటానికి జట్కా బండిపై వెళుతుండగా చిన్న ప్రమాదం జరిగింది. అప్పుడు కడుపులో ఉన్న తనకు ఏమైందో అని నాన్న కంగారు పడ్డారు. వెంటనే ఇంటికి వెళదామని నాన్న అంటే.. తనకు ఏమీ కాలేదని సినిమా చూసే వెళదామని అమ్మ చెప్పిందట. అంత పిచ్చి అమ్మకు అక్కినేనిగారి సినిమాలంటే' అని చిరు చెప్పుకొచ్చారు.