: ఆర్టీసీకి ఈ సంక్రాంతి కాసులు కురిపించింది


సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. మామూలు రోజులకన్నా రెండు కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. ఈ నెల 19వ తేదీ ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కోటి రూపాయల అదనపు ఆదాయాన్ని ఆర్జించినట్లు ఆర్టీసీ విజయవాడ రీజియన్ అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి భారీగా కృష్ణాజిల్లా వాసులు తరలివచ్చారు. వీరందరికీ తిరుగు ప్రయాణానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ విజయవాడ రీజియన్ నడిపింది. ఆర్టీఎ దాడులతో ప్రైవేటు బస్సుల తాకిడి తగ్గటం కూడా ఆర్టీసీ ఆదాయానికి కారణమైంది.

  • Loading...

More Telugu News